హైదరాబాద్‌లో ఉల్లెగడ మంటలు సామాన్యుడి జేబుకు చిల్లులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని మలక్‌పేట హోల్‌సేల్ మార్కెట్‌తో పాటు నగరంలోని వివిధ రిటైల్ దుకాణాల్లో ఉల్లి ధరలు అమాంతం పెరిగి కిలో రూ.80 నుండి రూ.100 వరకు పలుకుతున్నాయి. అకాల వర్షాలు, పంట నష్టాల కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి ఉల్లి సరఫరా గణనీయంగా తగ్గిపోవడంతో మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ తారుమారవుతోంది. సరఫరా కొరత కారణంగా తలెత్తిన ఈ ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం వెంటనే సబ్సిడీ ఉల్లి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి సామాన్యులను ఆదుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.