నీటి సంక్షేమంపై దేశం కోసం ఉత్తర్ప్రదేశ్ వృద్ధుడి పాదయాత్ర

రిపోర్టర్: గోపి స్థలం: రాజమహేంద్రవరం

ఉత్తర్ప్రదేశ్లోని ఝాన్సీకి చెందిన 72 ఏళ్ల సతీష్కుమార్ నీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు రామేశ్వరం వరకు పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. తమ గ్రామం నీటి సంక్షోభంతో అల్లాడిపోతుంటే, కొన్ని ప్రాంతాల్లో నీటిని వృధా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 11న నీటిని గౌరవించండి నినాదంతో పాదయాత్ర ప్రారంభించిన ఆయన, ఇప్పటివరకు సుమారు 1,450 కిలోమీటర్లు నడిచానని గురువారం రాజమహేంద్రవరంలో వెల్లడించారు. ఇంకా సుమారు 1,000 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.