మత సామరస్యానికి ప్రతీకగా బంగాల్లోని బోస్ కుటుంబ దుర్గా పూజ
రిపోర్టర్: అశోక్
స్థలం: ఉత్తర 24 పరగణాలు
పశ్చిమ బంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా దండిర్హట్లోని బోస్ కుటుంబం నిర్వహిస్తున్న 347 ఏళ్ల నాటి దుర్గా పూజ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. విజయదశమి నాడు అమ్మవారి నిమజ్జన ఊరేగింపు ఒక ముస్లిం కుటుంబం ఇంటి ముందు ఆగి, తుది ప్రార్థనలు చేయడం విశేషం. వైద్యుడు జగబంధు బోస్ ప్రారంభించిన ఈ పూజలో ప్రత్యేక ఆకృతిలో ఉన్న దుర్గాదేవి విగ్రహాన్ని పూజిస్తూ, మూడు శతాబ్దాల సంప్రదాయాన్ని ఆ కుటుంబం ఘనంగా కొనసాగిస్తోంది.