వార్డుల విభజనపై పునర్విచారణ జరపాలంటూ కమిషనర్ కు పల్లా విజ్ఞప్తి

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇటీవల మున్సిపల్ వార్డుల విభజన జరిగిన వాటిపై పునర్విచారణ చేయవలసిందిగా జివిఎంసి కమిషనర్ కు లేఖ పంపించారు. వివిధ వార్డుల ప్రజలు ఈ విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతిపత్రాలు ఎమ్మెల్యే కార్యాలయంలో సమర్పిస్తుండడంతో ఆయన తక్షణమే స్పందించి ఈ లేఖను ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఈ సమస్యపై అధికారుల నుండి సానుకూల నిర్ణయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.