ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఉత్పత్తులను ప్రమోట్ చేయొద్దన్న తుకారం ముండే

రిపోర్టర్: నరేష్ స్థలం: మహారాష్ట్ర

ప్రజల ఆరోగ్యాన్ని హాని చేసే ఉత్పత్తుల ప్రచారాలపై ప్రముఖ నటులు పునరాలోచించాలని మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారం ముండే స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేసిన విజ్ఞప్తికి ఆయన మద్దతు తెలిపారు. ప్రభావం అనేది చట్టాల నుంచి మినహాయింపు ఇవ్వదని ఆయన పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమిస్తూ పరోక్షంగా పాన్ మసాలా ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్న షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్, టైగర్ ష్రాఫ్‌లకు ఇప్పటికే ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.