తెలంగాణలో బీజేపీ పాదయాత్ర: నవంబర్ 2న అమిత్ షా పర్యటన
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ 2న తెలంగాణలో పర్యటించనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. రాష్ట్రంలో నిర్వహించనున్న బీజేపీ పాదయాత్రలో ఆయన పాల్గొంటారని వెల్లడించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని, దానిని ప్రజల్లోకి వెళ్లి తిప్పికొట్టడమే లక్ష్యంగా ఈ యాత్ర చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అమిత్ షా పర్యటన ద్వారా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాలని పార్టీ భావిస్తోందని నేతలు వివరించారు.