కొత్త పెన్షన్ దరఖాస్తుల గడువును వెంటనే పొడిగించాలి.. వైసీపీ నాయకుడు వారా నూకరాజు డిమాండ్!
రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు
స్థలం: కొయ్యూరు
రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువును మరికొంతకాలం పొడిగించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల వైసీపీ కార్యదర్శి వారా నూకరాజు ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని పలు సచివాలయాల్లో నెట్వర్క్ సిగ్నల్ సమస్యలు ఉండటంతో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడంలో అర్హులైన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సెలవులు, సర్వర్ సమస్యల కారణంగా గడువు సరిపోవడం లేదని, మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజల సౌలభ్యం కోసం వెంటనే గడువు పెంచాలని విజ్ఞప్తి చేశారు.