సూర్యాపేటలో వరుస చైన్ స్నాచింగ్ల ముఠా గుట్టురట్టు చేసి బంగారంతో నిందితుల అరెస్ట్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం అర్బన్

సూర్యాపేట జిల్లాలో మహిళలను లక్ష్యంగా చేసుకుని వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఖమ్మం పట్టణానికి చెందిన ఇద్దరు యువకులను సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు నాలుగు లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. కోదాడ మరియు సూర్యాపేట ప్రాంతాలలో ఈ నేరాలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.