మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ తెలంగాణ పోలీసులు హెచ్చరిక

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

డ్రగ్స్ మత్తు క్షణికమని, దీని ప్రభావం జీవితాంతం వెంటాడుతుందని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరుతూ 'సే నో టు డ్రగ్స్' నినాదంతో అధికారిక ఎక్స్ వేదికగా శనివారం ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. మత్తుకు పూర్తిగా నో చెప్పి, ఆరోగ్యకరమైన భవిష్యత్తును ఎంచుకోవాలని ప్రజలకు, యువతకు వారు విజ్ఞప్తి చేశారు.