సికింద్రాబాద్ లో గణేష్ లడ్డూ వేలంలో రికార్డు ధర

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: సికింద్రాబాద్

సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం కాలనీలో గణేష్‌ చతుర్థి వేడుకల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంలో కాలనీకి చెందిన షేక్‌ రహమతుల్లా రూ.24,000కు లడ్డూను దక్కించుకున్నారు. గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు భక్తిశ్రద్ధలతో పాల్గొని ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. లడ్డూను సొంతం చేసుకున్న రహమతుల్లాను కమిటీ సభ్యులు ఘనంగా అభినందించారు.