గునుపూడిలో వైసీపీకి బిగ్ షాకిస్తూ భారీగా టీడీపీలోకి వలసలు
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నాతవరం
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గునుపూడిలో సుమారు రెండు వందల మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. గ్రామాభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మౌలిక వసతుల కల్పనకు కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు విజయ్ స్పష్టం చేశారు.