ఉత్తరాంధ్ర జీవన సౌందర్యం: గరివిడి లక్ష్మీ సినిమా ట్రైలర్ విడుదల
రిపోర్టర్: హరి
స్థలం: శ్రీకాకుళం
ఉత్తరాంధ్ర ప్రాంతపు మట్టి వాసనను, సంప్రదాయాల గొప్పతనాన్ని, పల్లె జీవనంలోని సహజత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఓ అందమైన ప్రయత్నమే గరివిడి లక్ష్మీ సినిమా అని కింజరాపు రామ్మోహన్ నాయుడు - కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ వెల్లడించారు. ఉత్తరాంధ్ర యాసలోని మాధుర్యం, మన భాషలోని ఆప్యాయత, సంస్కృతిలోని వైభవం, జానపదంలో దాగిన జీవన సౌందర్యం అన్నీ ఈ చిత్రంలో అద్భుతంగా ఆవిష్కృతమయ్యాయని ఆయన కొనియాడారు.