మత్తు పదార్థాలకు దూరంగా బతుకులను తీర్చిదిద్దుకోవాలని యువతకు పిలుపు

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డిగూడెంలో మంగళవారం రాత్రి పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ సుర్వి మల్లేష్గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐ జి. మన్మధకుమార్, ఎస్ఐ నర్సిరెడ్డి పాల్గొని యువతకు దిశానిర్దేశం చేశారు. యువత మత్తు పదార్థాలు, జూదం, బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడితే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు.