యాదగిరిగుట్ట రామలింగేశ్వర ఆలయంలో ఘనంగా గణపతి హోమం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని మహా గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు జరిపి, హోమ ద్రవ్యాలను సమర్పించి భక్తులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక బృందం మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. క్షేత్రం అంతా భక్తిపారవశ్యంతో నిండిపోయింది.