ఆటో ప్రయాణికులకు భారీ షాక్: కనిష్ట ఛార్జీ రూ.30కి పెంపు

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో ఆటో ప్రయాణికులకు పెద్ద షాక్ తగిలింది. పెరిగిన ఇంధన ధరల కారణంగా ఆటో ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రభుత్వం జీఓ నంబర్ 46ను జారీ చేసిందని అధికారులు తెలిపారు. నూతన నిబంధనల ప్రకారం మొదటి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.30గా నిర్ణయించారు. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు అదనంగా రూ.14 వసూలు చేయనున్నారు. రాత్రి వేళల్లో అదనపు ఛార్జీలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.