దిల్లీలో తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై కీలక భేటీ

రిపోర్టర్: సురేష్ స్థలం: న్యూఢిల్లీ

దిల్లీలో సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన తెలుగు రాష్ట్రాల జలవివాద పరిష్కార కమిటీ సమావేశం వాడీవేడీగా సాగింది. 2014 విభజన నాటి నీటి లభ్యత ఆధారంగా వాటాలు తేల్చాలని, గోదావరిపై కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని ఏపీ డిమాండ్ చేసింది. పాత ప్రాజెక్టులకే రీ-ఇంజినీరింగ్ చేశామని తెలంగాణ వాదించింది. అనుమతులు, నీటి కేటాయింపులపై స్పష్టత రాకపోవడంతో నెలాఖరులో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.