పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఎస్ఈసీ పునేఠా కఠిన మార్గదర్శకాలు

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో ఎంపీటీసి మరియు జడ్పీటీసి ఎన్నికల ఓట్ల లెక్కింపును శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించి రాత్రి ఎనిమిది గంటలలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని అధికారులు తెలిపారు. లెక్కింపు ఏర్పాట్లపై ఎస్ఈసీ పునేఠా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత తొలి ఫలితాలు వెలువడే అవకాశం ఉందని, పన్నెండు గంటల్లోనే కౌంటింగ్ పూర్తి చేసి ఫలితాలు ప్రకటించాలని అధికారులను స్పష్టం చేసినట్లు వారు పేర్కొన్నారు.