శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
రిపోర్టర్: హరి
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మరియు ఉత్తరాంధ్ర జనసేన పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ సుందరపు సతీష్ కుమార్ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ వేడుకల్లో ఘనంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.