అబుదాబి బుక్‌ ఫెయిర్‌లో సాలూరు బాలిక ప్రతిభ

రిపోర్టర్: హరి స్థలం: విజయనగరం

అబుదాబి ఇంటర్నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌లో సాలూరుకు చెందిన 14 ఏళ్ల బాలిక సాయికీర్తన రాసిన 'ద ఫేడింగ్‌ డాన్‌' పుస్తకం ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న సాయికీర్తన తన సృజనాత్మకతతో ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని రచించింది. లెర్నర్స్‌ సర్కిల్ ఆధ్వర్యంలో ఆవిష్కరించిన 150 పుస్తకాల్లో ఈ నవల గుర్తింపు పొందడంతో తెలుగు కీర్తి అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడించింది.