పర్యావరణ రక్షణే ధ్యేయం: మోదీ సేవా సేవలను పురస్కరించుకుని మొక్కలు నాటిన బీజేపీ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పామూరు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పామూరులో బీజేపీ నేతలు మొక్కలు నాటారు. మండల అధ్యక్షులు ఉమ్మడిశెట్టి శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నేతలు పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ చారి పాల్గొన్నారు.