పంజాబ్ రాజకీయం కలకలం: అసెంబ్లీ సభ్యత్వానికి ఆప్ ఎమ్మెల్యే కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ రాజీనామా

రిపోర్టర్: రాము స్థలం: Amritsar

పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. అమృత్సర్ నార్త్ నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ తన శాసనసభ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేసినట్లు కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను స్పీకర్ కు ఈమెయిల్, వాట్సాప్ ద్వారా పంపినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో పార్టీతో విభేదాలు వచ్చిన నేపథ్యంలో ఆయన తీసుకున్న ఈ సంచలన నిర్ణయం రాజకీయ వర్గాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.