బహుజన రాజ్యం సాధన కోసం అందరం ఏకం కావాలని పిలుపు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలోని కొండ్రెడ్డి చెరువు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమాజ్వాది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాముల శ్రీనివాస్ మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం అందరం కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. బహుజన రాజ్యం నిర్మాణం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ విధివిధానాలను, భవిష్యత్ కార్యాచరణను గ్రామస్థులకు, పార్టీ శ్రేణులకు సవివరంగా తెలియజేశారు.