ఆదిలాబాద్లో కలకలం: పోలీస్ స్టేషన్కు వెళ్లొచ్చిన యువకుడు బలవన్మరణం

రిపోర్టర్: సునీల్ స్థలం: Adilabad

ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రిలో గొడవ కారణంగా పోలీసుస్టేషన్కు తీసుకెళ్లిన కాంబ్లే రాహుల్ అనే యువకుడు ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే బలవన్మరణానికి పాల్పడ్డాడని టూ టౌన్ ఎస్ఐ కె. ప్రణయ్ కుమార్ తెలిపారు. తన చావుకు పోలీసులతో పాటు వైద్య సిబ్బందే కారణమని సూసైడ్ నోట్లో పేర్కొనడంతో పాటు రాహుల్ మృతిపై దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారని, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని ఆయన వెల్లడించారు.