పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలతో దేశాభివృద్ధికి బీజేపీ కృషి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Jaipur
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా జైపూర్ వేదికగా జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు నితిన్ నబీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి చేరుకుంటున్నాయని వెల్లడించారు. ఇటీవల రాజస్థాన్ లోని మూడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయని స్పష్టం చేశారు.