రైతు బజార్లలో కిలో ముప్ఫై ఐదు రూపాయలకే ఉల్లి విక్రయం

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయవాడ

ఉల్లిపాయల ధరల భారాన్ని తగ్గించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బజార్లలో కిలో ముప్ఫై ఐదు రూపాయలకే సబ్సిడీ ధరకు ఉల్లిపాయలను విక్రయించనున్నట్లు మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలి దశలో విజయవాడలోని అన్ని రైతు బజార్లలో రేపటి నుంచి ఈ సబ్సిడీ ఉల్లి అందుబాటులోకి రానుంది. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు రెండు కేజీల చొప్పున పంపిణీ చేయనున్నారు. ప్రజల డిమాండ్ను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఈ సబ్సిడీ విక్రయాలను విస్తరిస్తామని వారు స్పష్టం చేశారు.