గ్రామాల్లో ప్రజలతో మమేకం: భద్రతపై భరోసా కల్పిస్తున్న శ్రీసత్యసాయి పోలీసులు
రిపోర్టర్: అశోక్
స్థలం: శ్రీ సత్యసాయి
శ్రీసత్యసాయి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రజలతో మమేకమవుతూ భద్రతపై భరోసా కల్పిస్తున్నట్లు Satya Sai Police వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, హిందూపురం డీఎస్పీ రవిబాబు పర్యవేక్షణలో లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోడిపల్లి, విభూతిపల్లి ప్రాంతాలలో వాక్ విత్ ప్రైడ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ భద్రతా చర్యలపై భరోసా కల్పిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.