తిరుమలలో నాలుగు యుగాల వైభవంతో అద్భుతమైన పుష్ప ప్రదర్శన

రిపోర్టర్: రమేష్ స్థలం: తిరుమల

తిరుమలలో ఏర్పాటు చేసిన భారీ పుష్ప ప్రదర్శన భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో 72 వేల అరుదైన పూలతో నాలుగు యుగాల పురాణ ఘట్టాలను టీటీడీ కళ్లకు కట్టింది. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల వైభవాన్ని తెలిపే 14 ఆధ్యాత్మిక థీమ్స్‌తో రూపొందించిన ఈ ప్రదర్శనను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు.