తిమిడి గ్రామంలో విస్తృత ప్రచారం: ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరిన లలిత కుమారి
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం తిమిడి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో లలిత కుమారి విజయనగరం స్వయంగా పాల్గొని ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్ లో పోటీ చేస్తున్న ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను ప్రత్యేకంగా కోరారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తమ పార్టీ అభ్యర్థులకు మద్దతునిచ్చి ఆశీర్వదించాలని ఈ ప్రచారంలో ఆమె విజ్ఞప్తి చేశారు.