అడవులను వన్యప్రాణులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవన్న అటవీ అధికారులు
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
అడవులు, వన్యప్రాణులతోనే భవిష్యత్తు ఉంటుందని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ అటవీ శాఖా అధికారులు తెలిపారు. ఆదివారం గ్రామ ప్రజలకు అడవులు, వన్యప్రాణుల ప్రాముఖ్యతపై కళాకారులు పాటల రూపంలో అవగాహన కల్పించారు. అడవులలో చెట్లు నరకడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అడవులకు, వన్యప్రాణులకు హానీ తలపెట్టే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు ఉన్నారు.