విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఘనంగా 57వ NSS ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రిపోర్టర్: sai స్థలం: వెంకటాచలం

నెల్లూరుజిల్లా వెంకటాచలం మండలం కాకుడూరు పంచాయతీలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, నెల్లూరులో NSS సెల్ ఆధ్వర్యంలో 57వ జాతీయ సేవా పథకం (NSS) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. కె. సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. వీరారెడ్డి, VSU ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. విజయలక్ష్మి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి డా. కె. సునీత మాట్లాడుతూ, NSS విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు సమాజంలోని సమస్యలను గుర్తించి, ప్రజల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. వీరారెడ్డి మాట్లాడుతూ, NSS ద్వారా విద్యార్థులు విద్యతో పాటు సామాజిక బాధ్యతను కూడా అలవర్చుకుంటారని అన్నారు. సమాజ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.

NSS సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ మాట్లాడుతూ, NSS కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సేవా దృక్పథం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మరియు సామాజిక చైతన్యం పెంపొందుతున్నాయని తెలిపారు.

NSS కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో NSS ప్రోగ్రామ్ అధికారులు డా. బి. వెంకట సుబ్బారెడ్డి, డా. శంకర్, డా. సూచరిత కీలకంగా వ్యవహరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ బోధన, బోధనేతర సిబ్బంది, NSS వాలంటీర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

“Not Me But You – నేను కాదు, నువ్వు” అనే NSS నినాద స్ఫూర్తితో విద్యార్థులు సమాజ సేవకు అంకితమై పనిచేయాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.