విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు: భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు

రిపోర్టర్: సతీష్ స్థలం: Vijayawada

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దుర్గా ఆలయం ఈవో వి.కె. సీనా నాయక్ తెలిపారు. అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరిగే ఈ వేడుకల్లో భక్తుల సౌకర్యార్థం ఐదు ఉచిత క్యూ లైన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రూ. 100, రూ. 300, రూ. 500 దర్శన టిక్కెట్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఐదు వేల మంది సిబ్బందిని విధుల్లో ఉంచామని ఆయన స్పష్టం చేశారు.