బడి ప్రాంగణాల్లో పచ్చని మొక్కలు నాటిన సర్పంచ్లు
రిపోర్టర్: kasanivenkatesh
స్థలం: నేలకొండపల్లి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల వ్యాప్తంగా పాఠశాలల్లో ఏక్ పేడ్ మా కే నామ్ వేడుకలు కోలాహలంగా సాగాయి. రాజారాంపేట, రామచంద్రాపురం, బోదుల బండ, అజయ్ తండా, పైనంపల్లి తదితర పాఠశాలల్లో సర్పంచ్లు రాయపూడి రామారావు, పవన్, నాగార్జున, శివాజీ, నరేష్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. భావితరాల భవిష్యత్తు కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాలని నేతలు పిలుపునిచ్చారు.