లంకలకోడేరులో ఐదు లక్షలతో ప్రారంభమైన తాగునీటి సరఫరా
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకోడేరు
ఏడేళ్ల నిరీక్షణకు తెరపడింది. మంత్రి నిమ్మల రామానాయుడు చొరవతో లంకలకోడేరు రాజీవ్ కాలనీలో యాభై ఐదు లక్షలతో ఓవర్హెడ్ ట్యాంక్, కొత్త పైప్లైన్ పనులు పూర్తయి స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వచ్చింది. నియోజకవర్గంలో మిగతా గ్రామాలకూ నీటి ప్రాజెక్టులు వేగవంతం చేశామని, ఇచ్చిన మాట ప్రకారమే తాగునీటి కష్టాలు తీర్చామని కాలనీ పర్యటనలో మంత్రి స్పష్టం చేశారు.