దసరా కానుకగా కొత్త పింఛన్లు అందిస్తామన్న మంత్రి సీతక్క
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ కానుకగా అక్టోబర్ నెలలోనే పంపిణీ ప్రారంభించేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వెరిఫికేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించే బాధ్యతను సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్‌కు అప్పగించారు. ముఖ్యంగా అర్హత కలిగిన ఒంటరి మహిళలు, వితంతువులకు మొదటి ప్రాధాన్యత కింద పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించారు.