అక్షత్ శ్రీవాస్తవ పోస్ట్ వైరల్: అవకాశాలపై వ్యవస్థాపకుడి ఆసక్తికర వ్యాఖ్యలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
అవసరమైన సమయంలో దొరకని అవకాశాలు, ఎలాంటి అవసరం లేనప్పుడు వెతుక్కుంటూ వస్తాయని ప్రముఖ వ్యాపారవేత్త అక్షత్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. విదేశాల్లో ఎంబీఏ చదివే సమయంలో తాను పడిన ఇబ్బందులను, ఇప్పుడు రోజుకు రెండు ఉద్యోగ ఆఫర్లు వస్తున్న వైనాన్ని లింక్డ్ఇన్ వేదికగా ఆయన పంచుకున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది.