ఆసియా క్రీడల్లో ఇండోనేషియాపై భారత్ ఘన విజయం

రిపోర్టర్: రాము స్థలం: India

ఆసియా క్రీడల పురుషుల హాకీ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు తొలి పూల్ ఏ మ్యాచ్‌లో ఇండోనేషియాపై 13-1 గోల్స్ తేడాతో అఖండ విజయం సాధించింది. దిల్ ప్రీత్ సింగ్ నాలుగు గోల్స్‌తో అద్భుత ప్రదర్శన చేయగా, శిలానంద్ లక్రా, సుఖ్‌జీత్ సింగ్‌లు రెండేసి గోల్స్ సాధించారు. అభిషేక్, రాజిందర్ సింగ్, మన్‌దీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, జుగ్‌రాజ్ సింగ్ తలా ఒక గోల్ తో రాణించారు.