అటవీ సిబ్బందిపై మూకుమ్మడిగా దాడి చేసిన గిరిజనులు
రిపోర్టర్: సునీల్
స్థలం: Kamareddy
అటవీ భూముల ఆక్రమణను అడ్డుకునేందుకు వెళ్లిన తమపై గిరిజనులు విద్యుత్ సరఫరా నిలిపివేసి మూకుమ్మడిగా దాడి చేశారని బాధితులు శ్రీనివాస్, ప్రదీప్ తెలిపారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం హాజీపూర్ తండా శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. అడవులను నరుకుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సమయంలో సుమారు యాభై మంది తండావాసులు వచ్చి సెల్ఫోన్లు లాక్కొని దారుణంగా కొట్టారని వివరించారు. గాయపడిన అధికారులను ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.