మొసలి దాడిలో కేర్‌టేకర్ దుర్మరణం
రిపోర్టర్: అశోక్
స్థలం: World
పపువా న్యూగినియాలోని అడ్వెంచర్ పార్క్‌లో మొసలికి ఆహారం వేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కేర్‌టేకర్‌పై మొసలి ఒక్కసారిగా దాడి చేసి కాళ్లను నోట కరుచుకుంది. సిబ్బంది గంటపాటు శ్రమించినా ఫలితం లేకపోవడంతో పోలీసులు మొసలిని కాల్చి చంపారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.