మంచిర్యాలలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై అధికారులతో సమీక్ష

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: మంచిర్యాల

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, భూముల రీ-సర్వే, సాదాబైనామాలపై సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ, బెల్లంపల్లి సబ్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, మంచిర్యాల రాజస్వ మండల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించినట్లు కలెక్టర్ మంచిర్యాల వెల్లడించారు. ఈ సమావేశంలో ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.