కరెంటు కోతల నిరసన: పురుగుమందు డబ్బాలతో సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం తలకొండపల్లి వెల్జాల సబ్ స్టేషన్ వద్ద రైతులు పురుగు మందు డబ్బాలతో నిరసన తెలిపారు. వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ చంద్రధన రైతులు సబ్ స్టేషన్ ముట్టడించారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి కోతలు నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.