వినాయక చవితి వేళ రద్దయిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఎచ్చెర్ల

వినాయక చవితి సెలవు దినం కావడంతో సోమవారం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జిల్లా మరియు మండల స్థాయిల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి కార్యాలయాలకు వచ్చి వ్యయప్రయాసలకు గురికావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ అర్జీలను ఆన్లైన్ ద్వారా లేదా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా నమోదు చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.