గిరిజన సంక్షేమానికి కేసీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయం
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ప్రెస్ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆదివాసి గిరిజన నాయకులు ప్రెస్మీట్ నిర్వహించారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడంతో పాటు రిజర్వేషన్ను పది శాతానికి పెంచారని నాయకులు తెలిపారు. ఈనెల 17వ తేదీన అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.