టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తేనే పల్లెల అభివృద్ధి సాధ్యమన్న పచ్చిపాల రామిరెడ్డి
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. బీసీ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఎంపీటీసీ అభ్యర్థిగా సాని భారతిని, జెడ్పీటీసి అభ్యర్థిగా పొట్టేల ప్రసాద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన స్థానిక ప్రజలను కోరారు.