జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వివాహంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మౌలానా

రిపోర్టర్: వెంకట్ స్థలం: శ్రీనగర్

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జర్నలిస్టు నిధి రజ్దాన్ వివాహంపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షాహాబుద్దీన్ రజ్వీ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం ఈ వివాహం చెల్లదని ఆయన పేర్కొన్నారు. నిధి రజ్దాన్ మతం మారకుండా వివాహం చేసుకోవడం షరియత్ నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఈ పరిణామంతో మతపరమైన నిబంధనలు, వ్యక్తిగత స్వేచ్ఛపై జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ ప్రారంభమైంది.