సింగరేణి లాభాల ప్రకటనలో యాజమాన్యం అనుసరిస్తున్న కర్కశ వైఖరి
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
సింగరేణిలో ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఉత్పత్తి లాభాలకు సంబంధించి యాజమాన్యం వివరాలు ప్రకటించకపోవడం విడ్డూరమని ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు ఎం.డి. చాంద్ పాషా ఆరోపించారు. బెల్లంపల్లి రీజియన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఉత్పత్తి లాభాలపై ప్రకటన చేయకుండా, సింగరేణి సంస్థకు రావలసిన బకాయిలు రాబట్టుకోకుండా, అప్పులు చూపుతూ కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను తగ్గించే కుట్రలకు పూనుకుంటున్నారని విమర్శించారు. వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి కార్మికుల వాటాను వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.