మొర్రిగూడెం పంచాయతీలో రోడ్డు సమస్యలు: పట్టించుకోని అధికారులపై స్థానికుల ఆగ్రహం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మొర్రిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని భంగ్య నాయక్ తండాలో నెలకొన్న సమస్యలను అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండా పరిధిలో రహదారి పరిస్థితి అధ్వానంగా మారడంతో ప్రజలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు సంబంధిత సర్పంచ్ గానీ, వార్డు సభ్యులు గానీ సమస్య పరిష్కారానికి ఎలాంటి చొరవ చూపలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.