తిరుమలలో వైభవంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు భారీగా భక్తుల రద్దీ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తిరుమల

కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై కొలువుదీరిన శ్రీ మలయప్పస్వామి, గజేంద్రమోక్షం విశేష అలంకారంలో తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. నేడు అత్యంత విశిష్టమైన గరుడవాహన సేవ జరగనుండటంతో తిరుమలపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.