ఈసీ నిర్ణయంపై మల్లికార్జున ఖర్గే నిప్పులు: బీజేపీ తీరును తప్పుబట్టిన ప్రతిపక్షాలు

రిపోర్టర్: రమేష్ స్థలం: దిల్లీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల కమిషన్ను నడుపుతున్నారని రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దిల్లీలో జరిగిన ఇండీ కూటమి మాక్ పార్లమెంట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సామాన్యుడి ఓటు హక్కు ప్రమాదంలో పడిందని ఆరోపించారు. 2023 చట్టాన్ని రద్దు చేసి సీఈసీని తొలగించాలని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను నిలిపివేయాలని ఖరాఖండీగా డిమాండ్ చేశారు.