ప్రభుత్వ భూముల తాకట్టుపై మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంపై బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి భారీగా రుణాలు సమీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇజ్జత్ నగర్, మోకిల, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఎనిమిది వందల ఎకరాలకు పైగా భూమిని తాకట్టు పెట్టి పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలు పొందారని క్రిశాంక్ స్పష్టం చేశారు.