మహాకవి గురజాడ 164వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా కేంద్రంలో మహాకవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. గురజాడ స్వగృహంలో ఉదయం జ్యోతి ప్రజ్వలన, నివాళులు అర్పించిన అనంతరం కాంస్య విగ్రహం వరకు ఊరేగింపు ఉంటుందని, కలెక్టరేట్లో జయంతి సభ జరగనుందని పేర్కొంటూ ప్రజలు, సాహితీ అభిమానులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.